Sunday, December 2, 2012

డీఎస్సీ-2012 ఎంపిక జాబితాల ప్రకటన

డీఎస్సీ-2012 ఎంపిక జాబితాల ప్రకటన
హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 26, 27, 28 తేదీల్లో నిర్వహించిన టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఎంపిక జాబితాలను ప్రకటించే ప్రక్రియ డిసెంబరు 1నుంచి జిల్లాల వారీగా ప్రారంభమయింది. ఈ జాబితాలను వివిధ జిల్లాల విద్యాధికారి వెబ్‌సైట్‌లలో పొందుపరుస్తున్నారు. డీఎస్సీ- 2012 ద్వారా మొత్తం 21,343 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి నవంబరు 26 న మెరిట్ జాబితాలను విడుదల చేశారు. డిసెంబరు 3 నుంచి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబరు 3 స్కూల్ అసిస్టెంట్స్, 4న లాంగ్వేజ్ పండిట్స్, 5న సెకెండరీ గ్రేడ్ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ప్రొవిజనల్ జాబితాలో అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు గెర్హాజరైతే తర్వాత ఉన్న అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. డిసెంబరు 15న తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబరు 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందజేస్తారు.

CERTIFICATE VERIFICATION SCHEDULE


03.12.2012     -    SCHOOL ASSISTANTS   (MATHS / PHY SCI / BIO SCI /
                                                                          SOCIAL / TELUGU / HINDI)



 04.12.2012    -    LANGUAGE PANDITS     (TELUGU/HINDI) 
                                                 &
                            PHYSICAL EDUCATION TEACHER 



 05.12.2012    -    SECONDARY GRADE TEACHER  
                                       (TELUGU/URDU MEDIUM)






CHECK LIST
VERIFICATION OF CERTIFICATES DSC 2012


1.  TET MARKS SHEET
2.  SSC CERTIFICATE
3.  CASTE CERTIFICATE
4.  SPECIAL CATEGORY  CERTIFICATES 
       (PHC   VH/HI/OH, EX-SER) 
5.  STUDY CERTIFICATES    IV   TO  X
6.  INTERMEDIATE CERTIFICATE
7.  DEGREE CERTIFICATES
8.  POST GRADUATE CERTIFICATES
9.  PROFESSIONAL QUALIFICATION 
       CERTIFICATES (D.Ed./B.Ed./TPT/HPT)





No comments:

Post a Comment